Telangana: దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశ ఎదురైంది. ఇంట్లో ఏమి లేవని CCTVలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏదైనా ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్తే కచ్చితంగా భారీ స్థాయిలో డబ్బులు తీసుకెళతారు దొంగలు. కానీ తాజాగా దొంగతనానికి వచ్చిన ఓ దొంగకు నిరాశ ఎదురైంది. దొంగతనానికి వెళ్లిన ఇంట్లో ఏమి లేవని సీసీటీవీలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంట్లో ఏమి లేవని వాటర్ బాటిల్ తీసుకొని రూ.20 పెట్టి పోయాడు దొంగ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దొంగకు ఏమి దొరకలేదని సామాచారం.. దీంతో నిరాశ చెంది సీసీటీవీలో తన ఆవేదన తెలిపాడు. చివరకు ఇంట్లో నుండి వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని, దానికి రూ.20 ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద రూ.20 నోటుని ఆ దొంగ పెట్టి వెళ్లిపోయాడు ఆ దొంగ. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.