సభలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోనే డిమాండ్ చేస్తున్నారు. సభ ప్రారంభం అయిన వెంటనే సభలో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభ వద్ద పెద్ద ఎత్తున మార్షల్స్ ను మోహరించారు. సస్పెండ్ అయిన సరే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పవరకు మేము నిరసనలు తెలుపుతూనే ఉంటాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
అనంతరం సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు స్పీకర్ పోడియం ముందు నేలపై కూర్చొని నిరసన తెలుపారు. మహిళ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, సబితా ఇంద్రా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాధ కలిగిస్తున్నాయని పలువురు మహిళా నేతలు కూడా పేర్కొంటున్నారు. బే షరత్ గా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.