తెలంగాణలో శాసన మండలి రద్దు ? కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదని హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసనమండలి ఏర్పాటు చేయడం కుదరదని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని వివరించారు. దీనిపై నేను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కోర్టులో కూడా పిటిషన్ వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కౌన్సిల్ రద్దు అవుతుందని… కౌన్సిల్ రద్దు అవడం ఖాయమని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. దానం నాగేందర్ టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయించారన్నారు. ఉపఎన్నికల్లో ఓడిపోయారు. ఇది చరిత్ర అని వివరించారు.అన్ని పార్టీల్లో ఆయారాం, గయారాం విధానాలకు స్వస్తి పలకాలని కోరారు.