కాంగ్రెస్ చేరిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పదవి పోవడం గ్యారెంటీ అన్నారు సీనియర్ నాయకలు, విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు. ఇవాళ సీనియర్ నాయకలు, విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్ కు అప్రతిష్ఠ తెస్తాయని హెచ్చరించారు. కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడుతుందని వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ చేరిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పదవి పోవడం గ్యారెంటీ అన్నారు.
2/3 వంతు ఉంటే తప్ప విలీనం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదన్నారు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసనమండలి ఏర్పాటు చేయడం కుదరదని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని వివరించారు. దీనిపై నేను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తా. కోర్టులో కూడా పిటిషన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో కౌన్సిల్ రద్దు అవుతుంది… కౌన్సిల్ రద్దు అవడం ఖాయం అని తెలిపారు సీనియర్ నాయకలు, విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు.