సంక్రాంతి నుండి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ – మంత్రి తుమ్మల

-

ఇల్లు లేని పేదలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. సంక్రాంతి నుండి ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని ప్రకటించారు మంత్రి. ఆదివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 57వ డివిజన్ రమణగుట్టలో టియుఎఫ్ఐడీసి నిధులు 85 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతలోనే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. సంక్రాంతి తర్వాత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఇక ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నగరానికి నీటి సరఫరా కోసం 220 కోట్లతో అమృత్ ద్వారా పనులు చేపట్టామని అన్నారు. వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే డంపింగ్ యార్డ్ రోడ్డు విస్తరణకు కోటి 15 లక్షలు, స్లాటర్ హౌస్ నిర్మాణానికి 8 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news