మాజీ సీఎం కాన్వాయ్ లో కారు బోల్తా.. పోలీసులకు గాయాలు

-

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్ లోని పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన వసుంధర రాజే గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాళీ జిల్లాలోని రోహత్, పానిహరి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

బైక్ రైడర్ ని రక్షించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసు బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఇటీవల కేబినెట్ మంత్రి ఒట్టారామ్ దేవాసి తల్లి మరణించగా.. ఆయన్ని పరామర్శించడానికి వసుంధర పాళీ జిల్లాలోని బాలికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోహత్ పాణిహరి క్రాస్ రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ విషయాన్ని పాలి జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఇక ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news