సీఎం కేసీఆర్ కి ప్రజా సమస్యల మీద చర్చించే దమ్ములేదా..? – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖర్ రావు గారికి అసెంబ్లీ అంటే ఎందుకు భయం..? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద చర్చించే దమ్ము లేదా? అంటూ నిలదీశారు. మూడొద్దులు అసెంబ్లీ పెట్టి, మీడియాలో మురిపించి తప్పించుకుందామనా? ఎన్నికల ముందే గడీల్లోంచి బయటకు వచ్చిన దొర గారు.. అసెంబ్లీ సెషన్స్ లోనూ జనాలకు కనిపించడా..? అంటూ విమర్శించారు.

 

“ముమ్మాటికీ అసెంబ్లీ సమావేశాల గడువు పొడిగించాలి. కేసీఆర్ రెండు దఫాల మేనిఫెస్టోపై, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చ జరగాలి. మీ డబుల్ టర్మ్ కి ఇదే ఆఖరి సెషన్. కేసీఆర్ దొర నిజంగా తెలంగాణ ప్రజల మేలుకోరే వారే అయితే.. మీ పాలన మీద మీకు నమ్మకమే ఉంటే, ఈ ఆఖరి సెషన్ లోనైనా మేనిఫెస్టో మీద తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ పాలనకు ఇది రెఫరండమని నిరూపించుకోవాలి. నియంతలా పాలించడం, దోచుకోవడం తప్ప మీకేం చేతనైంది? ముమ్మాటికీ మీద బంధిపోట్ల రాష్ట్ర సమితి, తాలిబన్ల రాష్ట్ర సమితి. ఎన్నికలప్పుడు బయటకురావడం కాదు.. తొమ్మిదేండ్లలో ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదో చెప్పాలి. ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఏమయ్యాయో నోరు విప్పాలి. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలి. ఎస్సీలకు కేటాయిస్తామన్న రూ.50వేల కోట్లు నిధులపై చర్చించాలి. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ నోరు తెరవాలి. అమరుల కుటుంబాలకు ఏం మేలు చేశారో చెప్పాలి. బంధిపోట్ల రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖరుడికి ఈ దమ్ముందా?” అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version