రక్తదానం మరొకరి జీవితానికి వెలుగులు నింపుతుందని, రక్తదానం చేయండి ప్రాణదాతలు కండని, స్టూడెంట్ వెల్పేర్ అసోసియోషన్ నార్కట్ పల్లి సభ్యులు, ఆర్ టీ ఐ రక్షక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, సీనియర్ జర్నలిస్ట్ రాపోలు లింగస్వామి శాలివాహన పిలుపునిచ్చారు. తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రవేట్ హాస్పత్రితో చికిత్స పొందుతున్న పద్మ అనే పేషంట్ కి ఆపరేషన్ నిమ్మిత్తం అత్యవసరంగా రక్తం అవసరమవ్వడంతో మిత్రుని ద్వారా వివరాలు తెలుసుకుని తక్షణమే స్పందించి.. నాగోల్ లోని ఎస్ఎల్ఎంఎస్ బ్లడ్ బ్యాంక్ లో సంప్రదించి స్వచ్చందంగా రక్తదానం చేసి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా రాపోలు లింగస్వామి మాట్లాడుతూ.. రక్తదానం చేయడానికి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకురావాలని, ఆపదలో ఉన్న వారికీ మనం ఇచ్చే కొద్దిపాటి రక్తం వారికీ కొండత అండగా ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకోవడాని సహకరిస్తుందన్నారు. అత్యవసర చికిత్సలు, ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరం అవుతుందన్నారు. రక్తదాతలు ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడినవారమవుతామని తెలిపారు.