సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎవ్వరూ నమ్మొద్దు : మధు యాష్కి

-

జాతీయ పార్టీగా కాంగ్రెస్ సముచిత నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మధు యాష్కి గౌడ్ తెలిపారు. ఎవరికీ ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి నిబద్ధతతో పని చేస్తున్నకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెవ్వరికీ అన్యాయం జరగదని తెలిపారు మధుయాష్కి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే నేతలను ప్రస్తుత అత్యవసరాల రిత్యా అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగదు అంటూ పేర్కొన్నారు మధుయాష్కి.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకొని ఎక్కడైనా అలాంటి నిర్ణయం జరిగినా నిరాశ పడవద్దని తెలిపారు. ఎమ్మెల్సీలుగా ఇతర పదవులు  ఇచ్చేవిధంగా నేరుగా పార్టీ అధిష్టానం నుంచి హామీ ఉండేవిధంగా చేస్తామని చెప్పుకొచ్చాడు. అవసరం అయితే.. ఇలా నష్టపోయినా కార్యకర్తల రాజకీయ భద్రత కోసం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో కమిటీ వేస్తామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఖరారైన అభ్యర్థుల జాబితా అంటూ వచ్చే సమాచారాన్ని ఎవ్వరూ కూడా నమ్మొద్దని తెలిపారు మధుయాష్కి గౌడ్. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version