నేడు డబుల్‌ బెడ్‌ రూమ్‌ అర్హుల జాబితా ప్రకటన

-

తెలంగాణలో పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు రాష్ట్ర సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. ప్రస్తుతం ఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మూడు, నాలుగో దశకు సంబంధించి మరో 21 వేల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం రెండు దశల్లో 24,900 ఇళ్లను లబ్దిదారులకు అందించింది. డ్రాలో ఎంపికయిన లబ్దిదారులకు అక్టోబర్ 2, 5 తేదీల్లో ఇళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితో కలిపి ఇవాళ మొత్తం 45 వేల 900 ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రక్రియ పూర్తయితే మిగతావి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈరోజు ఉదయం హైదరాబాద్ కలెక్టరేట్​లో ఈ ర్యాండమేజేషన్ ఆన్​లైన్ డ్రా నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మొదటి విడతలో ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి 11,700 మంది లబ్దిదారులకు, రెండో విడతలో 13,300 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు మూడు, నాలుగో దశకు సంబంధించి మరో 21 వేల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version