డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హులు: రేవంత్ రెడ్డి

-

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హులు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని లీలా హోటల్‌లో ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్, పద్మ విభూషణ్​ అవార్డు గ్రహీత నాగేశ్వర రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై సన్మానం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగేశ్వర్ రెడ్డి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురాబోతోంది అని తెలిపారు. రాష్ట్ర ప్రజలకే కాదు.. ఇతర దేశాలకు తెలంగాణలో సేవలందించేలా రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చాలన్నదే మా ప్రయత్నం అన్నారు.

దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మేము ఇప్పుడు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10లక్షల వరకు పెంచి మరింత మంది పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గతంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. కానీ ఇప్పటితరంలో ఆ విధానం కనుమరుగైంది అని తెలిపారు. మేము మళ్లీ అదేవిధానాన్ని తెస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news