ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరక్ష నిర్వహించనున్నారు. 10.58లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్ లోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్ గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు లెక్చరర్స్ సూచిస్తున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 01 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జనరల్ విద్యార్థులు 500963, ఒకేషనల్ విద్యార్థులు 44581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 03వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులు 471021, ఒకేషనల్ విద్యార్థులు 44581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.