హైదరాబాద్ ను డ్రగ్స్, మాఫియాకు అడ్డాగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే: బండి సంజయ్

-

హైదరాబాద్ అంటే డ్రగ్స్ కు అడ్డాగా, తాగుబోతులకు అడ్డాగా, మాఫియాకు అడ్డాగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది… దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ దే అని విమర్శించారు. విచ్చలవిడిగా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నడుస్తుందని… యువత బతుకును పాడుచేస్తున్నారని విమర్శించారు. మంత్రి అనుచరుడికి ఒక్క హైదరాబాద్ లోనే 115 షాపులు ఉన్నాయని ఆరోపించారు. గతంతో ఉడ్తా పంజాబ్ సినిమా వచ్చిందని… ఇప్పుడు ఉడ్తా హైదరాబాద్ అని తీయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. నిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో డ్రగ్స్ తీసుకున్న 15 మంది ఉద్యోగులను తీసేశారని సంజయ్ అన్నారు. డ్రగ్స్ వల్లే పంజాబ్ లో ప్రభుత్వం కూలిపోయిందని ఆయన అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2015 డ్రగ్స్ కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదని.. కెల్విన్ అనే వ్యక్తిని తీసుకువచ్చి అరెస్ట్ చేసి వదిలిపెట్టారని విమర్శించారు. ఈడీ అధికారులకు డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని… చివరకు హైకోర్ట్లో ఈడీ అధికారులు పిటీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు. సీఎస్, ఎక్సైజ్ కమిషనర్ కు సరైన ఆధారాలు ఇవ్వకుంటే కోర్ట్ ధిక్కరణ కింద నోటీసులు అందించిందని బండి సంజయ్ అన్నారు. ఈడీకి ఆధారాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version