జూబ్లీహిల్స్ పబ్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఈ సంఘటనలో 11 మంది అరెస్ట్ అయినట్లు చెబుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి జోరా పబ్ లో వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతుండడంతో నార్కోటిక్ బ్యూరో జూబ్లీహిల్స్ పోలీసులు సోదాలు జరిపారు.

ఈవెంట్‌కు వచ్చిన వారు డ్రగ్స్ వాడుతున్నారని సమాచారంతో సోదాలు చేసిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు. దీంతో జొర పబ్ లో నార్కోటిక్స్ & జూబ్లీహిల్స్ పోలీస్ సోదాలు చేవారు. ఈ సందర్భంగా డ్రగ్ ప్రైమరీ టెస్ట్ నిర్వహించగా పలుగురికి డ్రగ్స్ పాజిటివ్ నిర్దారణ అయింది. అందులో కొందరికి పాజిటివ్ రావడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జొర పబ్ లో యువకులకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? ఎంతకాలంగా డ్రగ్స్ దందా నడుస్తోంది? ఎక్కడి నుండి డ్రగ్స్ తెచ్చారు? ఎంతకు విక్రయించారు? ఎవరెవరికి విక్రయించారు? వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ సేవించిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.