హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కి డ్రగ్స్ కొరియర్.. ఎఫిడ్రిన్ డ్రగ్ స్వాధీనం..!

-

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు లేకుండా చూడాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు సూచించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నగరంలో ఎక్కడో ఒక చోట డ్రగ్స్ కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సారి డ్రగ్స్  వెలుగులోకి వచ్చాయి. నగరంలోని డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్నటువంటి ఇద్దరూ వ్యక్తులను అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి సుమారు రూ.60లక్షల విలువైన 3 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పొడి రూపంలో ఉన్న రెండు డ్రగ్స్ ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని NDPS చట్టం కింద వారి పై కేసు నమోదు చేసారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందా.. పబ్ లు, అక్రమ రవాణా పై నిఘా ఏర్పాటు చేశారు. డ్రగ్స్, గంజాయి, వాడకం, రవాణా వంటి వాటిపై సమాచారం అందిన వెంటనే అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు.  హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్న ఎఫిడ్రిన్ డ్రగ్స్ విలువ దాదాపు కోట్లలో ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version