Telangana: అర్దరాత్రి ఆందోళన చేస్తున్న DSC అభ్యర్థులు

-

సీఎం రేవంత్‌ రెడ్డికి షాక్ తగిలింది. అర్దరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆందోళన చేశారు DSC అభ్యర్థులు. తమ నిరసనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, తాము స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నామని తెలిపారు DSC అభ్యర్థులు. నిరుద్యోగులు అందరం తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్దరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటు అంటూ DSC అభ్యర్థులు ఆగ్రహించారు.

DSC candidates protesting late night

ఇక DSC అభ్యర్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి..ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై సీరియస్‌ అయ్యారు. రేవంత్ రెడ్డి సమైఖ్య పాలలను గుర్తు చేస్తున్నారని ఆగ్రహించారు. తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ ఎదురుగా ఏర్ పోలీస్ గ్రౌండ్లో రేవంత్ సర్కార్ ఉంచిందని ఫైర్‌ అయ్యారు.

రాత్రి 11:30 అవుతున్నా మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లైట్లు లేని గ్రౌండులో చీకట్లో అక్కడే ఉంచారని మండిపడ్డారు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా లేక అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం ఇలాంటి దృశ్యాలు తెలంగాణ సమాజం చూసింది….రేవంత్ రెడ్డి గారు! మిమ్మల్ని గద్దెనెక్కించడానికి కారకులైన ఈ బిడ్డల బాధలు తీర్చండని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version