దసరా పండుగ సమీపిస్తోంది. నగర వాసులంతా పల్లెలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా తెలంగాణ ఆర్టీసీ దసరాకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తాజాగా దసరాకు ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
19 నుంచి 24వ తేదీ వరకు నడవనున్న 7 ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..
- 19వ తేదీ: నర్సాపూర్-సికింద్రాబాద్ రైలు (నంబరు 07270) సాయంత్రం 6 గంటలకు, సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు (07041) 19న సాయంత్రం 8 గంటలకు బయల్దేరుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
- 20వ తేదీ: తిరుపతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07042) రాత్రి 7.50 గంటలకు, సికింద్రాబాద్-కాకినాడ రైలు (07271) రాత్రి 9 గంటలకు బయల్దేరుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
- 21వ తేదీ: కాకినాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07272) రాత్రి 8.10 గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
- 23న:. సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు (07065) రాత్రి 7 గంటలకు బయల్దేరనుంది.
- 24న.. కాకినాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07066) రాత్రి 9 గంటలకు బయల్దేరుతుందని.. ఈ రైళ్లలో జనరల్, స్లీపర్, ఏసీ అన్ని తరగతుల కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సి.హెచ్.రాకేశ్ వెల్లడించారు.