సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ఛాయ్ తాగారు. కాగా, నిన్న సిద్ధిపేట, సిరిసిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. అనంతరం హైదరాబాద్ వచ్చారు. అయితే.. సిద్దిపేట సభ ముగించుకుని తిరుగు ప్రయాణంలో దాబాలో కాసేపు ఆగి చాయి తాగారు సీఎం కేసీఆర్. ఉద్యమ కాలం నాటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ.. దాబాలో కాసేపు ఆగి చాయి తాగారు సీఎం కేసీఆర్.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటు మధు సుదనా చారీ, మంత్రి హరీష్ రావు ఎర్రోళ్ల తదితరులు ఉన్నారు. అయితే… సీఎం కేసీఆర్ చాయ్ తాగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా, నిన్న సిద్ధిపేట, సిరిసిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేటకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను..నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ అన్నారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదన్నారు సీఎం కేసీఆర్.