తెలంగాణలో రైతు భరోసా పంపిణీ పై ఈసీ కీలక ఆదేశాలు..!

-

లోక్ సభ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తరువాతే పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని సీఈసీ ఆక్షేపించింది.

పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా  నిధులను విడుదలకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. ఐదు ఎకరాలు పైబడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం దాదాపు రూ.2000 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే, రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంగా తాజాగా ఈసీ మే 13న పోలింగ్ ముగిసిన తరువాతే పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version