హీరా గోల్డ్ లో ముగిసిన సోదాలు.. 400 కోట్ల వరకు..?

-

హీరా గోల్డ్ లో ఈడీ సోదాలు ముగిసాయి. 400 కోట్ల రూపాయల వరకు నౌ హీరా షేక్ అక్రమంగా సంపాదించారని అధికారులు గుర్తించారు. రెండు రోజులపాటు ఐదు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అధిక మొత్తంలో వడ్డీ ఆశ చూపెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీన పరుచుకుంది ఈడీ. 12 అధునాతన లగ్జరీ కారులను. 90 లక్షల రూపాయల నగదును.. నౌ హిరా షేక్ మీద ఉన్న 45 కోట్ల రూపాయల విలువ చేసే 13 ఆస్తుల పత్రాలు, బినామీ పేర్ల మీద ఉన్న 25 కోట్ల విలువ చేసే 11 ఆస్తుల పత్రాలు ఈడీ స్వాధీనం చేసుకుంది.

38% వడ్డీ ఇస్తానంటూ భారీ వసూలుకు పాల్పడారు నౌహీరా షేక్.. యూఏఈకి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు… విదేశాల్లోనూ పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు అధికారులు. అలాగే అధిక వడ్డీ, బంగారం పేరుతోటి వసులకి పాల్పడ్డ నౌ హీరా షేక్ ను గతంలోనూ అరెస్టు చేసారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news