రాష్ట్రంలో మరో భారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ.. నేడు కేటీఆర్ శంకుస్థాపన

-

మహీంద్రా సంస్థ రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైన మహీంద్రా… ఇందుకోసం జహీరాబాద్‌లో వెయ్యి కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్‌ బ్యాటరీ వాహన తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతుంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ మూడు, నాలుగు చక్రాల బ్యాటరీ వాహనాలను తయారు చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో…. వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.


మహీంద్రా, స్వరాజ్‌ బ్రాండ్లతో ట్రాక్టర్లను విక్రయిస్తున్న మహీంద్రా సంస్థ… ఆటోమొబైల్ రంగంలోకి మరో బ్రాండ్‌ను పరిచయం చేయనుంది. తక్కువ బరువు ఉన్న ట్రాక్టర్లను ఓజా బ్రాండ్‌ పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. కొత్త బ్రాండ్‌లో 40 మోడళ్లను ఒకేసారి తీసుకోచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓజా ట్రాక్టర్లను భారత్‌తోపాటు అమెరికా, జపాన్‌, ఆసియాలోని పలు దేశాలకు ఎగుమతి చేయానున్నారు. ఇప్పటి వరకు చిన్న చిన్న ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తయారవుతున్న సంగారెడ్డి జిల్లాలో ఇక నుంచి నాలుగు చక్రాల వాహనాలు సైతం తయారుకానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version