ఇంజనీరింగ్ కళాశాల నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మగారంగా మారకూడదు : సీఎం రేవంత్ రెడ్డి

-

ఇంజనీరింగ్ కళాశాల నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మగారంగా మారకూడదు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా కూకట్ పల్లి జేఎన్టీయూ లో క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యూకేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైద్యం పట్ల అవకాశం కల్పిస్తూనే.. పెట్టుబడిగా చూస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్ మెంట్ తీసుకొచ్చింది. వేల కోట్లు బకాయిలు పెండింగ్ లో పడ్డాయి. పెండింగ్ బకాయిలు వన్ టైమ్ సెటిల్ మెంట్ బాధ్యతను  మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాను.

ఈ అకాడమిక్ సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా మీకు సహాయం చేస్తుందని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల  నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మగారంగా మారకూడదు. కొన్ని కళాశాలల్లో కొత్త కోర్సులను తీసుకొచ్చారు. దేశ భవిష్యత్ కి అవసరమైన సివిల్ ఇంజనీరింగ్ కోర్సులను కొన్ని కళాశాలల్లో లేకుండా చేస్తున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ని తప్పకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉండాలని సూచించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version