ఈ మధ్య కాలంలో తెలంగాణలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఇటీవలే శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం విధితమే. ఇవాళ మేడ్చల్ సమీపంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో MLRIT ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ మొదటి సంవత్సరం చదువు తున్న శ్రావణి (18) హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
శ్రావణి తల్లితండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా మృత దేహాన్ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం. ప్రాదమిక దర్యాప్తు లో వికారాబాద్ జిల్లా మైలారం కొత్త తండా ధరూర్ మండలం కు చెందిన బలరాం, కవిత పెద్ద కూతురు శ్రావణి గా గుర్తించారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకొనంత పిరికిది కాదని కళాశాల లో ఏం జరిగిందో తెలిపాలి మాకు న్యాయం చేయాలని MLRIT కళాశాల ఆవరణ లో ఆందోళన చేశా మృతురాలి కుటుంబ సభ్యులు.