రాష్ట్రంలో మొత్తంగా 94 వేల మంది పోలీసులు ఉన్నారని.. ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా మన పోలీసుల సాయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసు ఉద్యోగం భావోద్వేగం ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే బాధ్యత. బాధితుల పట్ల పోలీసులంతా గౌరవంగా, మర్యాదగా మెలగాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లు, కబ్జారాయుళ్లకు అండగా ఉండటం కాదు. పోలీసు పేరు వినిపిస్తే చాలు.. నేరగాళ్లు భయపడేలా ఉండాలి. కొందరు పోలీసుల తీరు కారణంగా అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నేరగాళ్ల పట్ల కఠిన వైఖరి ప్రదర్శించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలి. నేరగాళ్ల వెన్నులో పోలీసులంటే వణుకు పుట్టాలన్నారు. స్టేషన్లకు వచ్చి హడావుడి చేసే వాళ్లను వదిలిపెట్టొద్దంటూ ఆదేశించారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలి. నేరగాళ్లు హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.