కేసీఆర్ అవకాశం ఇస్తే వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ…పదవులు అనుభవించి, అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారు….రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారని చురకలు అంటించారు. ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
కేసీఆర్ ను తప్పు పట్టే అర్హత కడియం కావ్యకు ఎక్కడిది? కడియం కారణంగానే రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారు… ఊసరవెల్లి, పాము కంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. Brs లో అన్నీ అనుభవించి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లోకి పోతున్నారా? మా పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్ళాలని ఆగ్రహించారు. చంద్రబాబు దర్శకత్వంలో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు….హైదరాబాద్ లో ఉన్న చెడ్డీ గ్యాంగ్ ల తరహాలో పార్టీలు మారే నేతలు కనిపిస్తున్నారని చురకలు అంటించారు.