లగచర్ల ఘటనలో ట్విస్ట్ నెలకొంది. లగచర్ల సంఘటనలో అరెస్టైన రైతు ఈర్య నాయక్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. బుధవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని ధృవీకరించారు వైద్యులు. ఈరోజు ఆ రైతుని నిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నారని సమాచారం అందుతోంది.
ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యం గా ఉంచుతోందట ప్రభుత్వం. ఈ విషయం తెలిసి సంగారెడ్డి జైలుకి భార్య వెళ్లిందట.. భర్త కోసం బయటే పడిగాపులు కాస్తోందట. ఈర్య నాయక్‌తో పాటు జైల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. నిమ్మకు నీరేత్తినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండటం నిజంగా సిగ్గుచేటు అంటు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. మరి ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.