పోలీస్ శాఖలో పని చేసే ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

-

పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండాలి బాధ్యతగా తమ విధులను నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కేసులకు సంబంధించిన వివరాలను ఎస్ఐ శివకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.

ప్రతి రోజు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ విస్తృతంగా చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పుపై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు. నేర నియంత్రణతో పాటు జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.. స్వచ్ఛందంగా వారి గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల ఆన్ లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version