రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్.. మూసీ ఇండ్లు కూలగొట్టి..?

-

రేవంత్ పాలనలో రైతుల ధాన్యం దళారుల పాలయ్యింది. బోనస్ బోగస్ అయింది.. రైతుబంధు రాదు, రుణమాఫీ కాదు అని హరీష్ రావు అన్నారు. నా ఎమ్మెల్యే పదవి కంటే 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావడమే నాకు ముఖ్యమని నేను రాజీనామాకు సిద్ధమయ్యాను. మహారాష్ట్ర ఎన్నికల్లో వరి పంటకు బోనస్ ఇచ్చామని రేవంత్ అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. జగిత్యాల వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చిండు కేసీఆర్.

ఇక రైతుల సీఎం కేసీఆర్.. బూతుల సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన హరీష్ రావు.. మూసీ పాదయాత్ర దమ్ముంటే ఇండ్లు కూలగొట్టిన చోట చెయ్ అని ఛాలెంజ్ విసిరారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవు.. మూసీ సుందరీకరణకు మాత్రం రూ.1,50,000 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి. రైతుల వడ్ల లోడు ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్ల లోడ్ ఎత్తడంలో రేవంత్ బిజీగా ఉన్నాడు అని తెలిపారు. ఇక వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేయాలి. రూ. 15 వేల రైతు భరోసా ఇవ్వాలి. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version