నేడు కాంగ్రెస్‌లోకి సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

-

రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరికొస్తున్న కొద్దీ నేతల జంపింగ్ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో చాలా మంది ఇతర పార్టీల్లో చేరి టికెట్లు పొందుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఆ జాబితీలో బీఆర్ఎస్ అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరారు.

Former MLA Koneru Konappa met CM Revanth Reddy

కోనేరు కోనప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంత్రి సీతక్క సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరగణం కూడా హస్తం పార్టీలో చేరనుంది. అయితే బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కోసం అన్నీ తానై ముందుండి నడిపించిన కోనేరు కోనప్ప బుధవారం రోజున జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా వరుసగా నేతలు పార్టీని వీడటంతో బీఆర్ఎస్ అధిష్ఠానం గందరగోళంలో పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news