కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ హెల్త్ కండిషన్ సీరియస్ గా మారింది. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్…. అమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తన నివాసంలో బక్క జడ్సన్ గత పది రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తుండగా…. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. ఆయనను ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయం.
అయితే…. నిరుద్యోగులకు మద్దతుగా నిలవటమే కాకుండా…. ఆందోళనల్లో పాలుపంచుకుంటూ తన గలాన్ని వినిపిస్తున్న బీఆర్ఎస్ నేత రజిని సాయిచంద్…. బక్క జడ్సన్ ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో…. బక్క జడ్సన్ పరిస్థితిని చూసి రజిని సాయిచంద్ చలించిపోయారు. తన ఇంట్లోనే దీక్షకు దిగిన జడ్సన్…. ఉలుకు పలుకు లేకుండా బెడ్ పై పడిపోయి ఉండటానికి గమనించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే….. ఆంబులెన్స్ కు ఫోన్ చేసి…. హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు బక్క జడ్సన్.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.