తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. సామాజిక భద్రతా పథకం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆటో డ్రైవర్లు, హోమ్ గార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తించేలా 2015 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేస్తోంది.
ఇందుకోసం ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి ఏట ఈ పథకాన్ని పొడిగిస్తూ వస్తుండగా… తాజాగా 2024 ఆగస్టు 4 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా, మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు కలుపుకొని 65 సీట్లలో BRS విజయం సాధిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్ లు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూస్తుంటే వందకు వందశాతం అక్కడ బీఆర్ఎస్ సర్కారు ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.