కారు ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్..జిల్లాల వారి లెక్క ఇదే.!

-

మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని కే‌సి‌ఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు. మళ్ళీ ప్రతిపక్షాలని నిలువరించి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే కాదు. సొంత పార్టీ నేతల బలం కూడా ముఖ్యమే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గెలిచే అవకాశాలు ఉండాలి. అప్పుడే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

రాష్ట్రంలో మొత్తం 119 సీట్లు ఉంటే అందులో 103 సీట్లలో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. అంటే దాదాపు బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 90 శాతం వరకు ఉన్నారు. వీరే నెక్స్ట్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలన్న..ఓడించాలన్న..ఇక 103 మందికి మళ్ళీ సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ గెలుస్తుందా? అంటే అబ్బో కష్టమే. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. కే‌సిఆర్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకపోయిన..స్థానికంగా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బి‌ఆర్‌ఎస్‌కు మైనస్ అవుతుంది. అందుకే అలాంటి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. అలా అని వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల అందరినీ పక్కన పెట్టిన కష్టమే.

వారు సీటు రాలేదని వేరే పార్టీలోకి జంప్ చేసిన చేస్తారు. అయితే ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ అంతర్గత సర్వే ప్రకారం వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలు 25 మందిపైనే ఉన్నారని అంటున్నారు. కొన్ని సర్వేలు చూస్తే 50 మంది వరకు వ్యతిరేకత ఎదురుకుంటున్నారని చెబుతున్నారు. అయితే పార్టీ లెక్కల ప్రకారం జిల్లాల వారీగా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల లెక్క చూస్తే.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 5, మహబూబ్‌నగర్‌లో 6, ఖమ్మంలో 5, హైదరాబాద్‌లో 4, రంగారెడ్డిలో 3, మెదక్‌లో 2, వరంగల్‌లో 4, నిజామాబాద్‌లో 3, నల్గొండలో 5, కరీంనగర్‌లో 3గురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలింది. ఓవరాల్ గా ఓ 35 మంది వరకు వ్యతిరేకత ఎదురుకుంటున్నారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version