తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్ మహానగరం మాత్రమే ఐటీకి అడ్డాగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఐటీ టవర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా నిజామాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది.
“రాష్ట్ర మంత్రి కేటీఆర్.. బుధవారం రోజున నిజామాబాద్ ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ‘టైర్ 2 పట్టణాలు, నగరాలకు ఐటీ సెక్టార్లో విస్తరించడంలో భాగంగా నిజామాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌ను రేపు ప్రారంభిస్తాను. యువత తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణల కోసం ఇందులో టీ-హబ్, టాస్క్ సెంటర్లను కూడా ఇందులో ఉన్నాయి. దీనిద్వారా తెలంగాణ అభివృద్ధిలో యువత పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది”. అంటూ కేటీఆర్ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
I will be inaugurating a new IT Hub in Nizamabad city tomorrow as part of our efforts to take IT sector to Tier 2 cities & towns 😊
The IT Hub will also have an embedded T-Hub and TASK centre to help youngsters innovate and upskill
Giving wings to the aspirations of the youth… pic.twitter.com/U0br4mJ3yn
— KTR (@KTRBRS) August 8, 2023