Facial Recognition: తెలంగాణ రాష్ట్రంలోనే టీచర్లకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు కానుందని… అధికారులు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు అందరికీ రేపటి నుంచి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమల్లోకి రానుంది.

ప్రభుత్వ బడులు అలాగే కేజీబీవీ లు, మోడల్ స్కూల్స్ అలాగే జనరల్ గురుకులాలలోని 1.220 లక్షల మంది టీచర్లకు ఇది వర్తించనుందని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా గైర్హాజరు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లాలో ఓ టీచరు 20 ఏళ్లపాటు విధులకు దూరంగా ఉంటూ జీతం తీసుకున్న ఘటన గత సంవత్సరం వెలుగు చూసిన సంగతి మనందరికీ తెలిసిందే.