ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేరుతో ఖమ్మంలో పెరిగిన బెదిరింపులు..!

-

స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేరుతో ఖమ్మం లోని ఓ కిరాణాషాప్ యజమానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ గణేష్ కిరాణం షాప్ యజమాని రాజన్నకి స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ రెడ్డిని అంటూ ఫుడ్ లైసెన్స్ అంటూ ఫోన్ లో బెదిరించారు దుండగులు. మీరు లైసెన్స్ తీస్కోకుంటే 2 లక్షల జరిమానా, జైలు శిక్ష, మీ కిరాణం షాప్ లో సామాను సీజ్ చేసి కోర్టుకి పంపిస్తానని బెదిరించారు.

ఆన్లైన్ లో అప్లికేషన్ పంపించి, మీ వివరాలు పంపమని కిరాణం షాప్ యాజమని అడిగారు. అలాగే 3 సంవత్సరాలకు గాను 12,336 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించాడు కిరాణా యజమాని. అయితే ఖమ్మంలో ఇలాగే ఫేక్ కాల్స్ వచ్చాయని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. అధికారుల నుండి వ్యాపారస్తులకు ఇలాంటి కాల్స్ రావని తెలిపారు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష. ఇలాంటి కాల్స్ వస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version