ఇదేందయ్యా ఇది.. బీహార్‌లో ఏడాదిగా నకిలీ పోలీస్ స్టేషన్ కొనసాగుతోంది. స్థానిక యువత వద్ద డబ్బులు వసూలు చేసి పోలీస్ ఉద్యోగాలు ఇచ్చాడు నిందితుడు. బీహార్ పూర్ణియ జిల్లా మోహిని గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి నకిలీ పోలీసు స్టేషన్ తెరిచాడు. గ్రామీణ రక్షాదళ్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానిక యువత వద్ద లక్షలు వసూలు చేసాడు రాహుల్.

ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2,500 నుండి రూ.5,000 వరకు వసూలు చేసి వారికి పాలసీ యూనిఫాములు, లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు అందించాడు రాహుల్. అక్రమ మద్యం రవాణాపై దాడులు చేయించి, లంచం తీసుకొని సగం డబ్బులు తమకు ఇచ్చాడని పేర్కొన్నారు యువకులు. దాదాపు ఏడాది తరువాత ఈ విషయం బయటపడడంతో, పోలీసులు గాలిస్తున్నారని తెలిసి పరారయ్యాడు రాహుల్.