Telangana Budget 2024: త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ

-

Telangana Budget 2024: తెలంగాణ రైతులకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి శుభవార్త చెప్పారు. త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేశారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ రూపొందించినట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు ఖరారు చేయబోతున్నామని వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయాలు..ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు, విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు, గృహ నిర్మాణానికి 7740 కోట్లు, నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు పెడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మాది ప్రజల ప్రభుత్వమని ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version