రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ సంక్రాంతి గొప్ప పండుగలా చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన నాలుగు కొత్త సంక్షేమ పథకాల అమలు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి నాలుగు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెస్తుందన్నారు.

నాలుగు పథకాల అమలుకు సుమారు 40 నుంచి 45 వేల కోట్ల అధిక భారం పడుతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 2000 కోట్లు, రైతు భరోసాకు 19 వేల కోట్లు చొప్పున ఖర్చు చేసుకుంటూ ముందుకు పోతామన్నారు. ఈ నాలుగు కొత్త పథకాల అమలులో ఎక్కడ ఎవ్వరికీ సందేహాలు అవసరం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక, అమలుకు విధి, విధానాలు లోతుగా చర్చించిన తరువాత రాష్ట్ర క్యాబినెట్ ప్రకటన చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news