గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో తండ్రీ, కొడుకు క్వాలిఫై

-

తెలంగాణ 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రధాన పరీక్షకు 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరిచినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ప్రధాన పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకు జరుగుతాయని, హాల్‌టికెట్లు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్లో పొందుపరుస్తామని తెలిపింది.

మరోవైపు ఆదివారం ప్రకటించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాల్లో తండ్రి, కొడుకు అర్హత సాధించారు. దాసరి రవి కిరణ్‌ ముచ్చర్ల – జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. తనయుడు మైకేల్‌ ఇమ్మానియేలు (25) దూర్య విద్యలో డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయస్సులో రవి కిరణ్‌ తనయుడికి సూచనలు ఇవ్వడంతో పాటు తానూ పరీక్ష రాయగా అందులో క్వాలిఫై అయ్యారు. రిజర్వేషన్, ఇన్‌ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో పరీక్ష రాయగలిగినట్టు రవి కిరణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version