విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు సీట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఖరారు అయ్యాయి. స్కూళ్లలో వసతుల ఆధారంగా రేటింగ్ ను బట్టి ఫీజులను నిర్ణయించారు. ఒక స్టార్ ఉంటే రూ. 8,500, రెండు స్టార్లు ఉంటే రూ. 10,000, మూడు స్టార్లు ఉంటే రూ. 11,500, నాలుగు స్టార్లు ఉంటే రూ. 13,000, ఐదు స్టార్లు ఉంటే రూ. 14,500గా పేర్కొంది.

ఈ నగదును తల్లికి వందనం కింద ప్రభుత్వం స్కూళ్లలో చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా… మరోవైపు ఏపీలో డిగ్రీ అడ్మిషన్లను ఇకనుంచి ఆఫ్లైన్ లోనే తీసుకోవాలని ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో జరిపిన చర్చలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నెల నుంచి కొత్త ఫీజుల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు.