మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధి మల్లంపేట్ – శంబిపూర్ రహదారిలో జరిగిన ప్రమాదం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెల్లవారుజామున ఓ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో కారు అదుపుతప్పి ఓ ఇంటి గోడ ఎక్కింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కానీ, ప్రాణనష్టం కానీ సంభవించలేదు.

స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందికి దింపారు. కారు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయింది. తెల్లవారుజామునే ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.