కోమురవెల్లిలో మహిళా అఘోరీ అరెస్ట్ !

-

Female Aghori of Komuravelli Mallikarjuna Swamy Temple: కోమురవెల్లిలో మహిళా అఘోరీ అరెస్ట్ అయ్యారు. బుధవారం రాత్రి పూట కోమురవెల్లిలో మహిళా అఘోరీ అరెస్ట్ అయ్యారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి మహిళా అఘోరి… స్త్రీని, ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రజలకు హితవు పలికారు. ఎక్కువగా ఇబ్బంది పెడితే ఇక్కడే దహనం అయిపోతా అని హెచ్చరికలు జారీ చేశారు మహిళా అఘోరి.

Female Aghori of Komuravelli Mallikarjuna Swamy Temple

అనంతరం భారీ బందోబస్తు నడుమ అఘోరిని పోలీస్ స్టేషన్​కు తరలించారు పోలీసులు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి.. వదిలిపెట్టారని సమాచారం. ఇక అంతకు ముందు..లోక కళ్యాణం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని మహిళా అఘోరీ ప్రకటించారు. వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేములవాడ ఆలయంలో చాలా ఏళ్లుగా ఉన్న దర్గాని కూలగొట్టాలని వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని ప్రకటన చేశారు మహిళా అఘోరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version