వరంగల్ లో దారుణం..పోలీస్ స్టేషన్ లోనే చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం

-

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణం ఓ వ్యక్తి సూసైడ్‌ కు ప్రయత్నం చేశాడు. ఎస్ ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లోనే చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసు సిబ్బంది ఎదుటే మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు బాధితుడు. పోలీస్ స్టేషన్‌ లోనే ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో ఒక్కసారిగా మట్టేవాడలో ఉద్రిక్తత నెలకొంది.

A man attempted scide in Warangal Police Commissionerate

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆటోనగర్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్ గా బాధితున్ని గుర్తించారు. గత నెల రోజు నుండి మట్టేవాడ ఎస్ఐ విట్టల్ బాధితుడిని వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. అనేక కేసుల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎస్సై విటల్ ను సస్పెండ్‌ చేయాలని అంటున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో జరుగుతున్న వరుస సంఘటనలతో పోలీసులపై విమర్శలు..వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version