బోరుగడ్డ అనిల్ సానుబూతిపరుడు ఊహించని షాక్ తగిలింది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదు కావడం జరిగింది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేశాడంటూ ఈ ఏడాది మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీటీసీ గోర సురేష్. ఈ తరుణంలోనే… తాజాగా బోరుగడ్డ అనిల్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 506, 509 క్రింద కేసు నమోదు అయ్యాయి.
ఈ కేసు విషయమై అనిల్‌ను శ్రీకాకుళం జిల్లా కోర్టుకు తీసుకువచ్చి.. జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇక నవంబర్ 5 వరకు రిమాండ్ విధించిన జడ్జి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. తనపై వార్తలు ప్రచారం చేసిన మీడియా సంస్థలను జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు అనిల్.