బీఆర్ఎస్ పోరాటం ఫలిస్తుందా? అంటే అవుననే చెప్పవచ్చు. బీఆర్ఎస్, అక్కడి ప్రజల పోరాటంతో… ఎట్టకేలకు కొడంగల్‌కు కాంగ్రెస్ బృందం వెళుతోంది. లగచర్ల ఘటనలో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోనున్నారు ఎంపీ మల్లు రవి & టీమ్. తొలుత రైతులను కలిసి.. వారి అభిప్రాయాల్ని సేకరించనున్నారు మల్లు రవి. ఆపై కలెక్టర్‌తో పాటు అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం కొడంగల్‌లో మీడియా సమావేశం ఉంటుంది.
ఇక అటు ఇక అటు ఢిల్లీలోనే లగచర్ల బాధితులు ఉన్నారు. రాష్ట్రపతిని కలిసాకే వెనక్కి రావాలని పట్టుదలతో రైతులు ఉన్నారు. ఇప్పటికే బాధితుల తరఫున అపాయింట్ మెంట్ కోరింది బీఆర్ఎస్. లగచర్ల ఘటన సమాచారం ఇవ్వాలని కోరింది రాష్ట్రపతి కార్యాలయం. అధికారులు నివేదిక ఇవ్వడంతో నేడు రాష్ట్రపతి నుంచి పిలుపుకు ఛాన్స్ ఉంది.