జీవితంలో పెళ్లి చేసుకోను.. నటి ఐశ్వర్య లక్ష్మి సంచలన కామెంట్స్

-

తమిళ, తెలుగు నటి ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలా మంది తమ వివాహ బంధానికి చరమగీతం పాడుతున్నారు. తెలుగు పరిశ్రమతో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ ఈ సంఖ్య చాలానే ఉంది.రీసెంట్‌గా జయం రవి, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సైతం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య లక్ష్మీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.


జీవితంలో ఇక పెళ్లి చేసుకోనని నటి ఐశ్వర్య ప్రకటించారు. ‘హలో మమ్మీ’ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ ప్రకటన చేశారు.‘25ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనుకున్నా.. ఓ మ్యాట్రిమోనిలో ఫ్రొఫైల్ కూడా పెట్టా.కానీ,కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వారందరూ రాజీపడి బతుకుతున్నారు. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news