జగిత్యాలలోని మోతె చెరువు కబ్జాకు ప్రయాణిస్తుండగా మత్స్యకారులు అడ్డుకున్నారు. గత రెండు రోజుల నుండి FTL పరిధిలో జేసీబీతో మట్టి పోసి కబ్జా చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. జగిత్యాల పట్టణానికి అనుకోని ఉండే మోతె పెద్ద చెరువు వద్ద భూమిలో FTL పరిధిలోని కొందరు కబ్జాదారులు మట్టి పోసి కబ్జాకు ప్లాన్ వేశారు. అయితే ప్రభుత్వం చెరువులను రక్షించాలని చెప్తునా.. అధికార దాహంతో కొందరు నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు.
ఇక మోతె చెరువు కబ్జా చేయడంతో తాము రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసారు మత్స్యకారులు. ఇప్పటివరకు మోతే చెరువు FTL పరిధిలోని సుమారు 20 ఎకరాల వరకు భూములను కబ్జా చేసి ఇల్లు నిర్మించారని దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోయిందని మత్స్యకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి FTL పరిధి గుర్తించి.. అక్రమ నిర్మాణాలను తొలగించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. Hydra తరహాలో కమిషన్ ను అన్ని జిల్లాలో ఏర్పాటు చేసి చెరువులను రక్షించాలని కోరారు.