సాధారణంగా ఈరోజుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా హుషారుగా కనిపిస్తున్నారు. కొంత మంది అయితే చిన్నప్పుడే మొబైల్ ఫోన్ కు అలవాటు పడుతున్నారు. ఇలా రకరకాల అలవాట్లను కలిగి ఉంటున్నారు. అయితే ప్రస్తుతం పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో యువత విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయికి బానిసలువుతున్నారని తెలిపారు. ఎవరూ డ్రగ్స్ తీసుకున్నా.. డ్రగ్స్ తమ వద్ద ఉన్నట్టు పట్టుబడినా వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా.. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా వారు శిక్షార్హులు అవుతారని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో డ్రింక్స్ డ్రగ్స్ కలిపి పిల్లలకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారని వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని స్పష్టం చేశారు. ఇళ్లలో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు.