ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ములుగు జిల్లాలో కోమటిపల్లి రివల్యూషనరీ పీపుల్స్ కమిటీకి చెందిన ఐదుగురు మావోయిస్టులు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. పోరుకన్నా ఊరు మిన్న కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని, లొంగిపోయిన మావోయిస్టులకు 24 గంటల్లో రివార్డు ఇస్తామని, పునరావాసం, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.

ఇక అటు ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు పోలీసులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలంగాణ సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్కు చేపట్టారు. ఈ క్రమంలోనే సరిగ్గా అదును చూసి మావోయిస్టులు ల్యాండ్ మైనట్ ని పేల్చగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.