భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేయనున్నారు. ఇవాళ సా. 6 గంటలకు ర్యాలీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక భారత సైన్యానికి మద్దతుగా నేడు జరిగే సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

కాగా, హైడ్రా కార్యాలయం బుద్దభవన్ పక్కనే హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరిగానే సొంతంగా పోలీస్ స్టేషన్ తోడు అవ్వడంతో హైడ్రా కార్యకలాపాలకు మరింత బలం సమకూరనుంది. ఈ పోలీస్ స్టేషన్ కి SHO గా ఏసీపీ పి.తిరుమల్ నియమితులయ్యారు. ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది SI లు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతానికి ఈ పోలీస్ స్టేషన్ లో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు.